Thursday, April 25, 2024

Big Breaking | కులాల ఐక్య‌త‌తోనే అభివృద్ది.. కాపుల్లో ప‌రివ‌ర్త‌న రావాలి: ఆవిర్భావోత్సవాల్లో పవన్​

ఏపీలోని మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన ప‌దో అవిర్భావ సంబురాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాత్రి ఆవిర్భావోత్స‌వాల‌నుద్దేశించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
జ‌న‌సేన ఉన్న‌దే స‌మాజంలో ప‌రివ‌ర్త‌న తీసుకురావ‌డానికి.. కులంపేరుతో కుమ్ములాడుకుంటే అభివృద్ధికి దూరం అవుతాం. కులాల ఐక్య‌క‌తోనే స‌మాజం బాగుంటుంది.. అన్ని కులాల‌కు అండ‌గా ఉంటా.. ఎస్సీ, ఎస్టీ, స‌బ్ ప్లాన్ నిధులు దారిమ‌ల్లుతున్న‌య్ అన్నాయ‌న్నారు.

ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర దేహీ అనే ప‌రిస్థితి రావ‌ద్దు.. ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకోవ‌డానికి డ‌బ్బుంది కానీ, ప్ర‌జ‌ల‌కు మేలు చేయడానికి లేదా? అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. త‌నకు ప్యాకేజీ అంటే గ‌తంలోనే చెప్పు చూపించా.. నా చెప్పులు తెనాలిలోనే త‌యార‌య్యాయి. నాకు వెయ్యికోట్లు ఆఫ‌ర్ చేశార‌నే ఆరోపిస్తున్నారు. డ‌బ్బుతో మీ గుండెల్లో స్థానం సంపాదించ‌గ‌ల‌నా? మ‌రోసారి ప్యాకేజీ అంటే చెప్పుతో కొడ‌తా.. అని మండిప‌డ్డారు ప‌వ‌న్‌..

ప‌దేళ్ల కింద‌ట పార్టీ పెట్టిన‌ప్పుడు నా వెన‌క ఎవ‌రూ లేరు.. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని చోట్ల పార్టీ విస్త‌ర‌ణ జ‌రిగింది. ఎంతో మంది పార్టీలు పెట్టి రాజ‌కీయాలు త‌ట్టుకోలేక పాలిటిక్స్‌నే వ‌దిలేశారు. ఒక్క‌డితో మొద‌లైన జ‌న‌సేన‌కు పులివెందుల‌తో స‌హా ఏపీ మొత్తం కార్య‌క‌ర్త‌లున్నారు. నేను డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి అమ్ముడుపోయే వ్య‌క్తిని కాదు. క‌మ్మ‌వాళ్ల‌కు నేను దాసుడిని అనే పిచ్చిమాట‌లు మాట్లాడుతున్నారు. కాపు యువ‌త‌లో ప‌రివ‌ర్త‌న రావాలి అని ఉద్వేగంగా ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement