Tuesday, May 7, 2024

పంటలను దెబ్బతీసిన తుపాను.. వేల ఎకరాల్లో నష్టపోయిన రైతులు..

నెల్లూరు, ప్ర‌భ‌న్యూస్: జిల్లాలో ఇటీవల కురసిన భారీ వర్షాల కారణంగా 3,559 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రెవెన్యూ జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వరి, మినుము పంటలు దెబ్బతిన్నాయన్నారు.సూళ్లూరుపేట , తడ, పెళ్లకూరు, దొరవారిసత్రం మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిందని తెలిపిన జేసీ .. దగదర్తి , సంగం మండలాల్లో కొంతమేర పంట నష్టం జరిగిందన్నారు.

3,061 ఎకరాల్లో వరి పైరు నీట మునిగిందని,353 ఎకరాల్లో నారుమడులు దెబ్బతిన్నాయన్నారు. 145 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిందన్నారు. పూర్తి వివరాలు సేకరించి నివేదిక అందజేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని , పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేసి డీ – కృషి యాప్‌లో నమోదు చేస్తామన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా జిల్లాలో నేడు , రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ .. అధికారులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement