Thursday, May 2, 2024

ఏపీకి వచ్చిన పరిశ్రమలు ఎన్ని ?: రామకృష్ణ

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తిరోగమన విధానాల వల్ల ఏపీలో కొత్తగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లులూ గ్రూప్, రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్ వంటి సంస్థల పెట్టుబడులు తరలిపోయినట్లు తెలుస్తోందన్నారు. పారిశ్రామిక పురోగతి లేకుండా రాష్ట్ర ప్రగతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఏపీ నుండి రాజ్యసభ సభ్యునిగా గెలిపించిన పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని ద్వారా ఏపీకి ఎంత పెట్టుబడులు వచ్చాయని నిలదీశారు. గత రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చిందని రామకృష్ణ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement