Friday, December 6, 2024

చంద్రబాబుకు వైసీపీ నేతల కౌంటర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావాలని కోరారు. మంచి వాళ్లయిన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటే తీసుకుంటామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ… చంద్రబాబుకు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు. బీసీలు చంద్రబాబు వద్దకు ఎందుకు వెళ్తారని జోగి రమేశ్ అన్నారు. అలాగే మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… చంద్రబాబుకు బాగా పిచ్చి ముదిరిందన్నారు. నిన్ను చూసి ఎమ్మెల్యేలు ఎవరు వస్తారని కొట్టు సత్యనారాయణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement