Tuesday, November 12, 2024

బైరి నరేశ్ వ్యాఖ్యలపై మంత్రి తలసాని ఫైర్..

అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. ఇతర మతస్థుల నమ్మకాలను దెబ్బతీయొద్దని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని వెల్లడించారు. రెచ్చగొట్టేలా మాట్లాడటం, మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం సహించరానిదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement