Thursday, May 2, 2024

గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్‌..

హైదరాబాద్‌, : గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో ) ప్రకటించింది. వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి మహిళలకు గర్భ నిర్ధారణా పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రెగ్నెన్సీ సమయాన్ని వాయిదా వేసుకోవడం గాని, ప్రెగ్నీన్సీని తొలగించుకోవడం గాని చేయాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పి ంది. కరోనా వ్యాక్సిన్‌ను గర్భిణీలు, బాలిం తలకు ఇప్పటి వరకు వైద్యులు అనుమతిం చడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గర్భిణీలకు కరోనా టీకాను వేయొచ్చని చెప్ప డం ప్రాధాన్యత సంతరించుకుంది. గర్భిణీలకు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలా..? వద్దా..? అన్న అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు అడిగిన సందేహాలకు డబ్ల్యూహెచ్‌వో స్పష్టమైన సమాధానాలు చెప్పింది. 35ఏళ్లకు పైబడి ఉన్న గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధుల(డయాబెటీస్‌, హైపర్‌టెన్షన్‌)తో బాధపడుతున్న వారికి కరోనా సోకితే పరిస్థితి తీవ్రంగా విషమిస్తుందని పేర్కొంది. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ లో గర్భిణులు, బాలింతలపైన ప్రయోగం జరగకున్నా… గర్భంలో ఉన్న శిశువుపై గాని, గర్భంలో శిశువును సంరక్షించే మాయపైగాని, గర్భిణీపైగాని కరోనా వ్యాక్సిన్‌ ఎలాంటి దుష్ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. కరోనా టీకా లైవ్‌ వ్యాక్సిన్‌ కానందున టీకా తీసుకున్నాక గర్భిణులకు గాని, కడుపు లో ఉన్న బిడ్డకు గాని కోవిడ్‌ సోకదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న గర్భిణీలతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కోవిడ్‌-19 నుంచి కాపాడేందుకు కరోనా టీకా ఇవ్వడమే శ్రేయస్కరమని తేల్చి చెప్పింది. ఇతర సాధా రణ మహిళలను కరోనా బారి నుంచి కాపాడిన విధంగానే గర్భిణీలను కూడా కోవిడ్‌ టీకా కాపాడుతుందన్నారు. టీకా సాధారణ మహిళలపై చూపే ప్రభావాన్నే గర్భిణీలుపై కూడా చూపుతుందని, ఇందులో ఎలాంటి తేడా లేదని స్పష్టం చేసింది. మరోవైపు బాలింతపై, ఆమె పాలుతాగే పిల్లలపై కరోనా టీకా ఎలాంటి దుష్ప్రభావం చూపడం లేదని తేలింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత తల్లులు తమ పిల్లలకు నిరభ్యంతరంగా పాలు ఇవ్వొచ్చని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
కాగా, గర్భిణులకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ఇప్పటి వరకు ప్రయోగాలు జరగలేదు. అయితే అమెరికా, బ్రిటన్‌లో పాలిచ్చే తల్లులు, గర్భిణులకు కూడా కరోనా టీకా వేశారు. అక్కడ ఎలాంటి దుషపరిణామాలు తలెత్త లేదు. గర్భంలో శిశువును సంరక్షించే మా యపై కరోనా టీకా ఏ విధమైన ప్రతి కూల ప్రభావాన్ని చూపించడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశంలో అనుమతి లభిస్తే గర్భిణులు నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చు.

  • డాక్టర్‌ కిరణ్‌ మాదల, ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త, క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి, నిజామాబాద్‌ జిల్లా మెడికల్‌ కళాశాల
Advertisement

తాజా వార్తలు

Advertisement