Sunday, April 28, 2024

చిన్నారుల‌పైనే థ‌ర్డ్ వేవ్ ముప్పు…

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌ వేవ్‌ ఆందోళనకర రీతిలో వ్యాపిస్తున్న నేప థ్యంలో మరికొన్ని రోజుల్లో థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్‌ వేవ్‌ అత్యధికంగా పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరి స్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు చర్యలను ప్రారం భించింది. మొదటి వేవ్‌లో వృద్ధులపై ప్రతా పాన్ని చూపించిన వైరస్‌, సెకండ్‌వేవ్‌లో యువత, మధ్య వయస్కులపై విరుచుకుపడు తోంది. ఇక థర్డ్‌ వేవ్‌లో చిన్నారులపై వైరస్‌ దాడి ఊహకందని విధంగా ఉంటుందని ప్రపం చవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు హెచ్చ రిస్తున్నారు. ముంబైతోపాటు ఇతర పట్టణా ల్లోని ఆసుపత్రుల్లోని చిన్న పిల్లల కోసం పీడియాట్రిక్‌ కోవిడ్‌ కేర్‌ వార్డులను ఏర్పాటు చేస్తోంది. కరోనా మొదటి వేవ్‌, సెకండ్‌వేవ్‌లు పిల్లలపై తక్కువగానే ప్రభావం చూపుతున్నా… వైరస్‌ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కరోనా మొదటి వేవ్‌లో 1శాతం కంటే తక్కువ మంది పిల్లలకు కరోనా సోకగా… సెకండ్‌వేవ్‌లో పిల్లలకు వైరస్‌ సంక్రమణ రేటు 10శాతానికి పెరిగింది. పరిస్థితులను బట్టి చూస్తే థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు వైరస్‌ సోకే ప్రమాదం 80శాతం ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా మాస్కు, భౌతికదూరం, శానిటైజర్లు వాడడం వంటి జాగ్రత్తలను పాటిం చాలన్న మానసిక పరిపక్వత పిల్లల్లో ఉండ దని, ఫలితంగా వారిపై థర్డ్‌ వేవ్‌ విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో చిన్నారుల సంఖ్య దాదాపు కోటి వరకు ఉంది. అక్టోబరు నుంచి డిసెంబరు వర కు కరోన థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మే చివరి నాటికి, జూన్‌ రెండో వారం నాటికి సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతుందని, అయితే జూన్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తే థర్ద్‌ వేవ్‌ చిన్నారులపై విరుచుకుపడే ప్రమా దముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో పాఠశాలలు ప్రారం భించెక ముందే ప్రభుత్వాలు చిన్నారులకు వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలని వైరాలజీ నిపుణులు సూచిస్తున్నారు. తరచూ పాఠశాలలను శానిటైజ్‌ చేయడం, మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పౌష్టికాహార స్థాయిలను మరింత పెంచడం, క్లాసు రూముల్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాంటున్నారు.
మరోవైపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ ఇస్తేనే థర్డ్‌ వేవ్‌ నుంచి వారిని కాపాడు కోగ లుగుతామని చిన్న పిల్లల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు ఇప్పటికే చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించాయి. దీంతో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై పలు టీకా ఉత్పత్తి సంస్థలు క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రా రంభించాయి. ఇప్పటికే మనదేశంలోని భారత్‌ బయోటెక్‌ చిన్నారులపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి పొందింది.
ఈ పరిస్థితుల్లో పిల్లలను మానసికంగా దృఢంగా ఉంచాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. ఏడాదిన్నరగా స్కూళ్లు బంద్‌ కావడంతో నాలుగు గోడల మధ్యే పిల్లలు ఉంటున్నారు. దీంతో తల్లిదండ్రుల కొత్త ఆంక్ష లతో కుంగిపోతున్నారని, ఒత్తిడిని ఎదుర్కోలేక చిన్నారుల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్న నేపథ్యంలో ఓ రకంగా తల్లిదండ్రులకు ఈ పరిస్థితులు గడ్డు కాలమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుఓల పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలని, ఇంట్లోనే ఆటలు ఆడించాలని సూచిస్తున్నారు. క్యారమ్స్‌, చెస్‌ తదితర ఆటలు ఆడించడంతోపాటు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement