Wednesday, May 1, 2024

దేశంలో మళ్లీ వేగంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

భారత్‌పై కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. నిర్లక్ష్యంతో ఉండడంతో… సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 35,871 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 172 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని 17,741 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రికవరీ కంటే కొత్త కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదువుతన్నాయి. తాజా లెక్కలతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,74,605కి చేరింది. వీరిలో కోవిడ్ నుంచి ఇప్పటి వరకు 1,10,63,025 మంది కోలుకున్నారు. 1,59,216 మంది మరణించారు.

ఇటు తెలంగాణలోను క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్త‌గా 278 మంది కి కరోనా సోకింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 111 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,662గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,265 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 830 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 35 మందికి క‌రోనా సోకింది.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా తీవ్రత రోజురోజు పెరుగుతుంది. పెరుగుతుంది. ఏపీ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 253 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 30,716 మందికి కరోనా నిర్దార‌ణ‌ పరీక్షలు నిర్వహించగా.. 253 మందిలో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.మరోవైపు చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారుతాజా కేసుల‌తో కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,92,522కి చేరింది. అలాగే క‌రోనా కార‌ణంగా 7,186కు మంది మృతి చెందారు. మరోవైపు తాజాగా రాష్ట్రంలో 137 మంది కోలుకోన్నారు. కాగా ఈ మహమ్మారి నుంచి 8,83,642 మంది కొలుకున్నారు. ప్రస్తుతం 1,694 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement