Wednesday, May 1, 2024

అష్టదళపాదపద్మారాధన సేవ కొనసాగింపు.. తిరుప్పావడ సేవా టికెట్లున్న‌ వారికి బ్రేక్‌ దర్శనం

తిరుమల ప్రభన్యూస ప్రతినిధి: వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్ధం జూన్‌ 30 వ తేది వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను జూన్‌ వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో భక్తులు బుక్‌ చేసుకున్నారు. కావున ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న వారిని అష్టదళపాదపద్మారాధన సేవకు అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. అదేవిధంగా అడ్వాన్సు బుకింగ్‌లో జూన్‌ 30 వతేది వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్‌ దర్శనానికి రావాలని కోరింది. లేని పక్షంలో సేవా టికెట్‌ రీఫండ్‌ పొందాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement