Tuesday, April 30, 2024

సివిల్‌ సర్వసెస్‌ చదరంగ పోటీల విజేతలకు సత్కారం

అమరావతి, ఆంధ్రప్రభ : ఢిల్లీల్లో ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకూ జరిగిన ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ చదరంగం పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ నుండి పాల్గొని ద్వితీయ స్థానం పొంది రజత పతకాన్ని సాధించిన బృందాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ సత్కరించారు. బుధవారం అమరావతి సచివాలయం ఆయన ఛాంబరులో ఈబృందాన్ని రజత్‌ భార్గవ శాలువ, జ్ణాపికలతో ఘనంగా సత్కరించారు. అఖిల భారత సివిల్‌ సర్వీస్‌ చదరంగ పోటీ-ల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించిన బృందంలో షేక్‌ తస్నీమ్‌ ఫైరుద్దుస్‌, ఎన్‌.మంజుల, సి.శ్రీవిద్య, ఎమ్‌.యమున, పి.శివ శ్రీలను సన్మానించారు.

ఏపీ సచివాలయం నుండి ఈబృందానికి మేనేజరుగా ఆర్‌.రమేశ్‌ బాబు, ఎ.వీర శేఖర్‌ కోచ్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎపిటిడిసి చైర్మన్‌ వరప్రసాద్‌ రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఇంకా సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు తదితరలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement