Sunday, April 28, 2024

Cock Fight – తూర్పులో పుంజు ఎగిరితే జైలే!

సంక్రాంతి వచ్చేస్తోంది.. పండుగ అంటేనే ఏపీలో మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, గుండాట.. ఇలా అనేక రకాల ఆటలు ఆడుతుంటారు. ఇక.. కోడి పందాలు అయితే కోట్లలో జరుగుతాయి.. కొందరు సర్వం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్ మాధవీలత రంగ‌లోకి దిగిపోయారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగడానికి వీలులేదని పోలీస్ యంత్రాగాన్ని ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా పుంజు బ‌రిలోకి దిగితే పోలీస్​ల‌పై కూడా క్ర‌మశిక్ష‌ణ చర్యలు తీసుకునేందుకు వెన‌కాడ‌బోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.

కోడిపందాలు నిర్వహిస్తే అంతేగతి..
గ్రామాల‌లో ఒకవేళ పందాలు నిర్వహిస్తే జైలు ఊసలు లెక్క‌బెట్టాల్సిందేన‌ని, ఫంట‌ర్ల‌కు, బెట్టింగ్ రాయ‌ళ్ల‌కు కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. పండుగ దినాల్లో కోడి పందాల నిరోధానికి 144సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు. కోడిపందాలతో పాటు ఇతర నిషేధిత ఆటలను ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని వార్నింగ్‌ ఇచ్చారు.

గ్రామ కమిటీలు ఏర్పాటు..కోడి పందాల నిషేధ ఉత్తర్వులు అమలకు గ్రామ కమీటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కలెక్టర్‌ మాధవీలత వెల్ల‌డించారు. కోడిపందాల నిషేధంపై గ్రామాలలో టామ్ టామ్ వేయించడం, మైక్ ప్రచారం చేయించడం, కరపత్రాలు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గత సంవత్సరం కోళ్ల పందాల నిర్వహణకు, బరుల ఏర్పాటుకు స్థలాలు ఇచ్చిన భూయజమానులను గుర్తించి అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి పందాలు జరిగితే గ్రామ, మండల కమిటీలను బాధ్యులుగా చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సీరియర్‌గా హెచ్చరించారు. కాగా, ఏటా కోడి పందాల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్​గా హెచ్చరించినా.. కొన్ని ప్రాంతాల్లో పందాలు కొనసాగుతోన్న విషయం విదితమే. అయితే ఈసారి స్వ‌యంగా క‌లెక్ట‌ర్ రంగంలోకి దిగ‌డంతో పందెం రాయుళ్లు రాజ‌కీయ వత్తిడి తెచ్చేందుకు స‌మాయ‌త్తమ‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement