Tuesday, May 7, 2024

AP Congress – రాజ‌న్న రాజ్య స్థాప‌న‌లో అన్న వదిలిన బాణం!

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – కాంగ్రెస్ మహా సముద్రంలో కలిసే ఏరులెన్నో..నదులెన్నో.. ఈ కథ ఈ నాటిది కాదు. తాజా కథల్లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ చాతుర్యంతో ఏపీలో జనం కోసం పుట్టిన ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్ కడలిలో కలసిపోయింది. తెంగాణలో రాజన్న స్థాపనే ధ్యేయంగా దివంగత వైఎస్ఆర్తనయ షర్మిల రెడ్డి ఇంటిలో జన్మించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా.. కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తరుణంలో… ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం, కలవరంసృష్టించిన వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం ఇది.

ఆమె.. ఓ అస్త్రం..

వైఎస్ షర్మిలా రెడ్డి. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ప్రస్తుతంఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సోదరి. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు. ఎట్టకేలకు తన తండ్రి బాటలోనే నడిచారు. కాంగ్రెస్ పట్ల తన తండ్రి వాత్సల్యానికి తానే సాక్ష్యంగా కనిపించారు. ఓ రాజకీయ దురంధురుడి వైఎస్ రాజశేఖరరెడ్టి కూతురుగా.. ఓ అన్న వదిలి బాణంగా షర్మిల రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇలా ఉంది. 2009 సెప్టెంబర్ 2న విమాన ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు. అభిమానుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ కుటుంబాలకు సంఘీభావంగా వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ససేమిరా అంది. అంతే జగన్ కాంగ్రెస్ నుంచి బయటక వచ్చారు. బిడ్డ వెంటే వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇక్కడి నుంచే జగన్ కు అష్ట కష్టాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేతల పిటీషన్తో చర్లపల్లి జైలుకు వెళ్లక తప్పలేదు. అప్పుడే షర్మిలమ్మ తెరమీదకు వచ్చింది. అన్నను జైలు నుంచి రప్పించటమే కాదు,, ప్రజల్లో జగన్ కుటుంబ స్థానాన్ని సుస్థిరం చేశారు.

జగనన్న బాణంలా…

అన్న కోసం షర్మిల కూడా 2020 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భాగంగానే పని చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు… పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు. అన్నను జనం మర్చిపోకుండా పాదయాత్రకు దిగారు. తన తండ్రి అందించిన పాదయాత్రకు సిద్ధపడింది. పులివెందులలో తండ్రి సమాధి నుంచి తన పాదయాత్రను ప్రారంభించింది. 2013 ఆగస్టు 4న ఈమె పాదయాత్ర ముగిసింది. 3112 కిలోమీటర్లు ఈ పాదయాత్ర జరిగింది. ఆ తరువాత జగన్ జైలు నుంచి వచ్చి తన పాదయాత్రను నిర్వహించారు. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల… తన సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అన్నకు వెన్నుదన్నుగా నిలవటమే కాదు,, అధికారంలోకి వచ్చే వరకూ వైపీపీలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

వైఎస్ఎర్ బిడ్డలా…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా షర్మిలా దూరమయ్యారు. ఈ స్థితిలోనే తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టిన ఏడాది తర్వాత ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తన కుమారుడి పార్టీవైఎస్సార్సీపీకి రాజీనామా చేసి షర్మిల పార్టీకి మద్దతు ప్రకటించారు.ఇక షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర జరిపి అధికారంలోకి వచ్చారు. అదే సెంటిమెంటుతో షర్మిల రెడ్డి కూడా 2021 అక్టోబర్ 20 న చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా పాలేరు వరకూ కొనసాగించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి పోటీ నుంచి విరమించుకున్నారు.

వైవాహిక జీవితం..

షర్మిల మత ప్రచారకుడు అనిల్ కుమార్‌ను కుల, మతాంతర చేసుకున్నారు. అనిల్ కుమార్ హిందువు. కానీ, వైఎస్ఆర్ కుటుంబం క్రిస్టియన్ కావడంతో 1995లో షర్మిలను వివాహం చేసుకున్న తర్వాత క్రైస్తవ మతంలోకి మారారు. 1998లో అనిల్ మత ప్ర‌చార‌కుడు అయ్యారు. అనిల్ కుమార్, షర్మిల దంపతులకు. రాజా రెడ్డి, అంజిలి రెడ్డి ఇద్ద‌రు పిల్లులున్నారు. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగనుంది. ప్రియా చట్నీస్ ఫుడ్ చైన్ యజమాని అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలే ప్రియ‌. వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరి అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న సమయంలో పరిచయమయ్యారు. వీరిది ప్రేమ, పెద్ద‌లు కుదిర్చిన వివాహం కావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement