Sunday, April 28, 2024

AP : ఈనెల 15న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన‌ కర్నూలు జిల్లాకు రానున్నారు. నగరంలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో జరిగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనువడి వివాహ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు జిల్లా అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. సీఎం ప‌ర్య‌ట‌న బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

700మందితో బందోబస్తు.. కర్నూల్ రేంజ్ డీఐజీ
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కర్నూల్ రేంజ్ డీఐజీ సిహెచ్ విజయ రావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కర్నూలుకు వ‌స్తున్న‌ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జిల్లా పోలీసు యంత్రాంగంతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం జగన్ ప‌ర్య‌ట‌న‌ సందర్భంగా భద్రత పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్.విజయరావు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచించారు. ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహానికి సీఎం హాజరవుతున్నందున కర్నూలు బళ్ళారి రోడ్డులోని కింగ్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్ష‌న్ పరిసరాలను, ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో భద్రతా పరంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

బందోబస్తు విధుల్లో..
అడిషనల్ ఎస్పీ ఒకరు, న‌లుగురు డీఎస్పీలు, 16మంది సీఐలు, 17మంది ఎస్సైలు, 63మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 130మంది కానిస్టేబుళ్ళు, 18మంది మహిళా పోలీసులు, 70మంది హోంగార్డులు, ఇతర జిల్లాల నుండి అడిషనల్ ఎస్పీ ఒకరు, 5మంది డీఎస్పీలు, 9మంది సిఐలు, 30 మంది ఎస్సైలు, 50 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 110 మంది కానిస్టేబుళ్ళు, 18మంది మహిళా పోలీసులు, 50మంది హోంగారులు, 3 స్పెషల్ పార్టీలు, 97మంది ఏఆర్ పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, తదితర ఏర్పాట్లకు సంబంధించి సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

- Advertisement -

సీఎం వచ్చే రూట్ బందోబస్తులను పరిశీలించిన అధికారులు..
పోలీసు అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, కర్నూలు సబ్ డివిజన్ డిఎస్పీ విజయ శేఖర్, ట్రైనీ డీఎస్పీ భావన, సిఐలు నాగరాజు యాదవ్, శ్రీనివాస రెడ్డి, శంకరయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement