Saturday, April 27, 2024

చంద్రబాబుకు జగన్ బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు పుట్టిన రోజు విషెస్ చెప్పారు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇక, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement