Sunday, May 19, 2024

సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని స‌మావేశం

సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి పేర్ని నాని స‌మావేశ‌మై ఆన్‌లైన్‌లో టికెట్ల విక్ర‌యాల‌పై చ‌ర్చ‌లు జరుపుతున్నారు. అన్ని సినిమాలపై టికెట్‌ ధర ఒకే విధంగా ఉండేలా కొత్త విధానంపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అలాగే, ఏపీలోని థియేటర్ల సమస్యలపై కూడా చ‌ర్చిస్తున్నారు. ఆన్‌లైన్ లో టికెట్ల విక్ర‌యాల‌కు అందరూ అంగీకరించారని నిర్మాత‌ అంబికా కృష్ణ ఈ సంద‌ర్భంగా అన్నారు.ఈ స‌మావేశంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement