Thursday, May 2, 2024

టపాకాయలు గోడౌన్ లో అగ్నిప్రమాదం – ముగ్గురు మృతి

చిత్తూరు – తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలో టపాకాయలు గోడౌన్ లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి…చెందారు. మృతుల్లో ఓ వృద్ధుడు …ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని లత్తేరికి చెందిన మోహన్ (55 ) కు లతేరి బస్టాండ్ సమీపంలో సొంత టపాకాయల గోడౌన్ ఉంది . ఆదివారం మోహన్ టపాకాయల గోడౌన్ను తెరిచి వ్యాపారం చేస్తున్నాడు. ఉన్న ఫలంగా గోడౌన్ నుంచి మంటలు చెలరేగి టపాకాయలు పేలింది. దీంతో గోడౌన్ పూర్తిగా దగ్ధం కావడంతో ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం ఏర్పడింది . ఆ సమయంలో గోడౌన్ లో యజమాని మోహన్ తో పాటు ఆయన మనవళ్ళు తేజశ్వరన్ ( 7 ) , దనుష్ ( 5 ) లు ఉన్నారు . ఉన్న ఫలంగా టపాకాయలు పేలడంతో మనవళ్ళును కాపాడేందుకు మోహన్ లోనికి వెళ్ళి ప్రయత్నించినప్పటికీ అప్పటికే గోడౌన్ పూర్తిగా పొగతో నిండుకుంది. దీంతో గోడౌన్ లో చిక్కుకున్న ముగ్గురూ బయటకు రాలేక పోయారు . స్థానికులు గమనించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరక పోవడంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించి సుమారు అరగంట పాటు పోరాడి మంటలను అదుపు చేశారు . మంటలు అదుపు చేసిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది గోడౌన్లోనికి వెళ్ళి పరిశీలించారు . ఆ సమయంలో మోహన్ తో పాటు ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకొని మృతి చెంది ఉండటాన్ని గమనించారు . ఇదిలా ఉండగా పెద్ద శబ్దంతో టపాకాయలు పేలడంతో అధిక సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు . విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు . అనంతరం కేసు నమోదు చేసి టపాకాయల గోడౌన్లో మంటలు ఏ విధంగా వచ్చింది . షాక్ సర్కుట్ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు . కలెక్టర్ విచారణ టపాకాయల గోడౌన్ దగ్ధమైన విషయం తెలుసుకున్న వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముగ సుందరం , ఎస్పీ సెల్వకుమార్ నేరుగా వెళ్ళి విచారణ జరిపారు . ఈ గోడౌను అనుమతి ఉందా , అనుమతి ఉంటే రక్షణ కవశాలను ఎందుకు ఉందుకు ఉంచలేదు . పట్టణ నడి బొడ్డున ఎందుకు అనుమతి ఇచ్చారు . అనే వాటిపై విచారణ చేపట్టారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement