Sunday, April 28, 2024

Saint – 19 ఏళ్ల యువ‌తి వైరాగ్యం …జైన స‌న్యాసిగా రూపాంత‌రం …

చిత్తూరు – 19 ఏళ్ల యువ‌తికి అప్ప‌డే వైరాగ్యంలో ప‌డిపోయింది…త‌న జీవితం అంతా కోరిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.. దీంతో జైన స‌న్యాసిగా మార‌నుంది.. ఎపిలోని చిత్తూరు జిల్లాకు చెందిన యువ‌తి సురానా తాను జైన న‌న్ గా మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.. హైద‌రాబాద్ లోని సోమాజీగూడ‌లో ఆమె త‌ల్లిదండ్రులు పద్మరాజ్‌ సురానా, స్వప్న సురానాల‌తో క‌ల‌సి మీడియాతో మాట్లాడుతూ, తాను జీవితంలో అన్ని కోరికలు, అనుబంధాలు త్యజించి సన్యాసినిగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పింది.. ఈ విషయంలో ఇప్ప‌టికే జైన మ‌త పెద్ద‌ల‌తో చ‌ర్చించామ‌ని తెలిపింది.. వారు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది.. దీంతో ఈ నెల 16వ తేదిన జైన స‌న్యానిగా మ‌త పెద్ద‌ల స‌మ‌క్షంలో మార‌నున్న‌ట్లు చెప్పింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement