Monday, April 29, 2024

అంతర్రాష్ట్ర ఎర్ర చందనం దొంగల అరెస్ట్

చిత్తూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): చిత్తూరు జిల్లా రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ఈ రోజు ఉదయం నిర్వహించిన దాడుల్లో 16 మంది దొంగలను ను అరెస్ట్ చేసి రూ 40 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగలను, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం చిత్తూరు డీ ఎస్ పీ శ్రీనివాస మూర్తి నేతృత్వం లో పూతలపట్టు, గుడిపాల మండలాలలో వాహనాల తనిఖీలు చేపట్టారు. గుడిపాల పోలీసులు ఉదయం 6.30 గంటలకు, చెన్నై-బెంగుళూరు రోడ్ లోని ఎం సి ఆర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా చిత్తూరు వైపు నుండి చెన్నై వైపు అతివేగంగా వస్తున్న ఒక కారును ఆపి తనిఖీ చేయగా అందులో 5 ఎర్ర చందనం దుంగలతో పాటు ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.

వెనుకే వస్తున్న మరో కారును ఆపి తనిఖీ చేయగా అందులో కూడా మూడు ఎర్రచందనం దుంగలతో మరో ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.అదేవిధంగా పూతలపట్టు పోలీసులు పీలేరు – చిత్తూరు – కడప రోడ్డు లో చేపట్టిన వాహనాల తనికీలో రెండు కార్లలో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలతో ఐదుగురిని అరెస్ట్ చేసారు. పైన తెలిపిన వారికి సహచరులు తమిళ నాడు కు చెందిన ప్రధాన స్మగ్లర్ లు నలుగురు, చిత్తూరు జిల్లా కి చెందిన ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి కూడా ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement