Thursday, May 2, 2024

లగ్గానికి మంచిరోజులు.. మోగనున్న పెళ్లి బాజాలు

అమరావతి, ఆంధ్రప్రభ : శుభముహూర్తాలు వచ్చేశాయి. …. ఉపనయనాలు(ఒడుగు), గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహ క్రతువుల బాజాల సందడితో కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. గురు మూఢం కారణంగా ఏప్రిల్‌లో శుభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అడ్డంకి తొలగటంతో బుధవారం నుంచి మళ్లీ బాజాలు మోగనున్నాయి.
మే, జూన్‌ నెలల్లో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌ 14వ తేది తరువాత మళ్లీ ఆగస్టు 18వ తేది వరకు శుక్ర మూఢమి కారణంగా పెళ్లిళ్లకు శుభ ముహుర్తాలు లేవు.

దీంతో వేసవిలోనే పెళ్లి తంతు పూర్తి చేయాలని వధూవరుల కుటు-ంబాలు ఇప్పటికే ముహుర్తాలు ఖరారు చేసుకుంటు-న్నాయి.దీంతో రాష్ట్రమంతా పెళ్లి సందడి నెలకొననుంది. ఈ రెండు నెలల కాలంలో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాలు శోభాయమానంగా అలంకరించారు. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు అయిన తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమలతో ఇతర పుణ్య క్షేత్రాల్లో వివాహాలు చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.

కొనుగోలుదారులతో దుకాణాలు కళకళ..

- Advertisement -

పెళ్లంటే పండగే. రెండు జంటల కలయిక ఎన్నో కుటు-ంబాల్లో సంతోషాల్ని నింపడమే కాదు…..శుభ కార్యక్రమాల నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన నిఫుణులకు చేతినిండా పని లభించనుంది. మామిడి తోరణాలు కట్టే పనివారల నుంచి వాహన రంగం, వదుకాణాలు, జ్యుయలరీ, బ్యుటీ-షియన్లు, బాజా భజంత్రీలు, నృత్య కళాకారులు, పురోహితులు, కల్యాణ మండపాల డెకరేషన్‌ నిఫుణులు, విద్యుత్తు అలంకరణ, ఫొటోగ్రఫీ, వీడియో, క్యాటరింగ్‌, మైకుసెట్లు-, దర్జీలు, పారిశుద్ధ్య కార్మికులు, పూల వ్యాపారులు, కూరగాయలు పండించే రైతులు తదితర రంగాలవారికి ఉపాధి లభించనుంది. అలాగే. శుభలేఖల ప్రింటింగ్‌ పనులు, కేట రింగ్‌, బాజాభజంత్రీలు, పురోహితులు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు, క్యాటరింగ్‌, అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, -టె-ంట్‌హోస్‌లకు మంచి డిమాండ్‌ రాబోతుంది. దాదాపు నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. సుముహూర్తాలు లేక పోవడంతో గత రెండు నెలలుగా వ్యాపారాలు లేక వెలవెల పోతున్న దుకాణాలు.. శుభముహూర్తాలు రావడంతో కొనుగోలు దారులతో వివిధ వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా బంగారు, వెండి ఆభరణాలు.. వస్త్ర వ్యాపార దుకాణాలు.. కిరాణా వ్యాపార సంస్థల్లో రద్దీ మొదలయింది.గత రెండు నెలలు ముహూర్తాలు లేక పోయినా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినావివాహాలకు బంగారు ఆభరణాలు ప్రధానం కావడంతో తప్పని పరిస్తితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు నెలలు ఈ వ్యాపారం జోరుగా సాగే అవకాశం వుంది.

రోహిణీకార్తె మండుటెండలు, అధిక ఉష్ణ్రోగ్ర్రతలు, వేసవి నేపథ్యంలో ఏసీ కల్యాణ మండపాలకు అధిక గిరాకీ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయం పాటిస్తూ తాటాకు పందిళ్లు వేస్తుండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

పురోహితులు నిర్ణయించిన ముహూర్తాల తేదీలు..

మే నెల 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 20, 21, 22, 26, 27, 28, 29, 30, 31 (దాదాపు 21 రోజులపాటు ముహూర్తాలు ఉన్నాయి)

  • జూన్‌ నెల 1, 3, 7, 8,9.
  • జూన్‌ 19 నుంచి ఆషాఢం రావడం, జులై 18 నుంచి అధిక శ్రావణ మాసం రావటంతో శుభ కార్యక్రమాలు ఉండవు.
  • ఆగస్టు 17 నుంచి నిజశ్రావణ మాసంలో 18వ తేదీ తర్వాత శుభకార్యక్రమాలు పున:ప్రారంభమవుతాయి.
    -ఉత్తరాయణంలో మాత్రమే చేసే ఉపనయనాలకు తేదీలు ఖరార య్యాయి. ఎక్కువగా ముహూర్తాలు లేకపోవటంతో కొంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు సామూహిక ఉపనయన కార్యక్రమాలకు శ్రీకారం పలుకుతున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement