Monday, April 29, 2024

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో… ఐదుగురు అరెస్టు…

తిరుపతి సిటీ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ తెలిపారు. ఈరోజు ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ రవి ప్రకాష్ మాట్లాడుతూ… చిన్న గొట్టికల్లు మండలం దేవరకొండ పంచాయతీ దేవరకొండ గొల్లపల్లి గ్రామం ఊరు సమీపంలో అమ్మ చెరువు పొదల వద్ద లోడ్ చేస్తూ ఉండగా.. సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించి.. ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారయ్యారన్నారు. అరెస్టు అయిన‌ వారిలో కత్తి అన్నయ్య (25), మామిడి కోన సురేష్ (31), దేవాంగుల వాసు (30), కత్తి ఎర్రయ్య (65), కత్తి శ్రీరాములు (45) ను అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు.

పరారైన వారిలో కత్తి నాగరాజు, కత్తి తులసి, కత్తి గౌరీ శంకర్, మామిడి కోట రెడ్డి ప్రసాద్, చిప్పిడి రమేష్ లు పరార్ లో ఉన్నారన్నారు. వీరి కోసం కూడా గాలిస్తున్నామని వివరించారు. మొదటి ముద్దాయి అయిన అన్నమయ్యపై గతంలో మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదైంద‌న్నారు. అలాగే వాయల్పాడు పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు ఉందన్నారు. వీరి నుంచి 1281 కేజీల బరువు కలిగిన 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. ఎర్ర చందనానికి ఉపయోగించిన కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పరమేశ్వర్ రెడ్డి వెస్ట్ డిఎస్పి నర్సప్ప, ఈ కేసులో ప్రతిభ కనబరిచిన భాకరాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసిరామ్, ఆర్మూర్ రిజర్వ్ ఆర్. ఐ చంద్రశేఖర్, ఎస్సై ప్రకాష్ కుమార్, చంద్రగిరి ఎస్ ఐ వంశీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement