Friday, April 26, 2024

అన్న‌దాత‌పై ధ‌ర‌ల మోత – దిక్కుతోచ‌ని స్థితిలో రైత‌న్న‌లు…

  • భారీగా పెరిగిన ఎరువుల ధరలు
  • కాంప్లెక్స్ ఎరువుల పై అదనంగా రూ 200
  • అదనపు భారం దిక్కుతోచని స్థితిలో వ్యవసాయం

చిత్తూరు ప్రతినిధి – కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో అన్నదాత లపై అదనపు భారం పడుతోంది. వ్యవసాయాధారిత మైన రైతులు నిత్యం ఎరువుల కొనుగోళ్లతో లావాదేవీలు సాగిస్తుంటారు .అయితే ప్రస్తుతం ఎరువులపై ధరలు రెట్టింపు కావడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .కాంప్లెక్స్ ఎరువులు పై రూ 200 మిగిలిన ఎరువులపై రూ 100 నుంచి ధరలు రెట్టింపు చేయడంతో దిక్కుతోచని స్థితిలో వ్యవసాయం సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు ఖర్చు తగ్గించాలని 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సాగు ఖర్చు తగ్గించాలి అంటూనే ఎరువుల ధరలు పెంచడమే దీనికి కారణం. ఒకపక్క గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయంగా ఎరువులు వాటి తయారీకి అవసరమైన ముడి సరుకు ధరలు పెరగడంతో దేశంలో డిఎపి కాంప్లెక్స్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చిందని కంపెనీల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. పాత సరుకు ధర పెరగ బోదని.. కొత్తగా ఉత్పత్తయ్యే ఎరువుల ధరలు పెరుగుతాయని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. ఈ నెలలో డీలర్లకు కొత్త ధరల ప్రకారం ఎరువుల విక్రయిస్తామని వాన కాలం నుంచి పెరిగిన ధరల ప్రకారం రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.అని వారు చెబుతున్నారు. దీనికితోడు పెరిగిన డీజిల్ ధరలు తో ట్రాక్టర్లు ఇతరత్రా వ్యవసాయ యంత్రాలను వినియోగించే రైతులకు అదనపు భారం కానున్నాయి. ఇలా అన్ని వైపులా నుంచి సాగు ఖర్చు పెరగనుంది కాబట్టి వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం తగ్గించాలని ఆలోచన కేవలం ఆదర్శంగా మారిపోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 2019లో కాంప్లెక్స్ ధరలు పెరగ‌డంతో మళ్లీ ఇప్పుడు వాటి ధరలను పెంచుతూ ఉండటంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

250 రూపాయలు డీఏపీ బస్తా పై అదనం
ఈ సంవత్సరం ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా డి ఏ పీ 20 వేల మెట్రిక్ టన్నుల మేరా, కాంప్లెక్స్ ఎరువులు లక్ష మెట్రిక్ టన్నుల మేర విక్రయాలు జరిగినట్లు ఆ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తం ఎరువుల వినియోగం లక్షకుపైగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం డి ఏ పి బస్తా ధర 50 కేజీలు 1200 రూపాయలు ఉండగా ఈనెల నూతన ఎరువుల విక్రయాల నుంచి 1,400 నుంచి 1450 రూపాయల వరకు పెరుగుతాయని వాటిని తయారు చేసే కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు ధరలు 140 నుంచి 250 రూపాయల వరకు పెరుగుతాయి చెబుతున్నారు. వినియోగం లెక్కల ప్రకారం చూస్తే డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల వల్ల జిల్లాలో రైతులపై దాదాపు మూడు కోట్ల మేర అదనంగా భారం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎరువుల ధరల పెరుగుదల పరిశీలిస్తే….
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ధరలు పెరుగుతాయని తెలిపినప్పటికీ..ఆ ధరలు పాత నిల్వలకు వర్తించవని నూతనంగా విడుదలైన ఎరువు లకు మాత్రమే వర్తిస్తాయి ని స్పష్టంగా తెలియజేసింది. దీంతో ఈ నెల చివరి వారంలో నూతన ధరలు అమలు కానున్నాయి. ఒకసారి ధరలు పరిశీలిస్తే …..డి ఏ పి ప్రస్తుత ధర రూ 1200 ,పెరిగిన ధర రూ 1450, రకం 20 -20 -0 -12 పాత ధర 950 నూతన ధర 1125, రకం 10 -26 -26 పాత ధర 1185 నూతన ధర 1385, రకం 28- 28- 0 పాత ధర 1275 నూతన ధర 1525, రకం 16- 20-0-12 పాత ధర 900 నూతన ధర 1050, రకం 14 -35- 14 పాత ధర 1275 నూతన ధర 1500, రకం 15- 15 -15 పాత ధర 1040 నూతన ధర 1200, రకం 12- 32 -16 ప్రస్తుత ధర 1200 పెరిగిన ధర 1375 రూ అమలు కానున్న వి

దిక్కుతోచని స్థితిలో రైతన్న
గత మూడు సంవత్సరాలుగా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా వరుస తుఫాన్లు, కరోనా ఒకవైపు, ఈ సంవత్సరం అధికంగా పెరిగిన డీజిల్ ధరలు, ఎరువుల ధరలు…. వీటికి తోడు కరోనా రెండో దశ ప్రారంభం కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో లక్ష రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులతో సాగు చేసిన రైతులకు గత మూడు సంవత్సరాలుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా చేసిన అప్పులకు వడ్డీలకు సరిపోతుంది .రైతన్న ఏమి చేయాలో దిక్కు తోచక ఎదురు చూస్తున్నాడు. దీనికితోడు ఎకర సాగుకు 20 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు కావడం కూలీల ఖర్చు రోజుకి 400 నుంచి 500 రూపాయల వరకు చేరడంతో రైతులు వ్యవసాయం సాగు చేయాలంటే కష్టతరంగా మారింది. ఇవన్నీ ఛేదించుకుని సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బ్యాంకు ల నుంచి రుణాలు రాకపోవడం, మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీలకు అప్పులు చేస్తుండడంతో వాటిని తీర్చేందుకు ఏమి చేయాలి పాలుపోని పరిస్థితిలో ఉన్నాడు.

- Advertisement -

ఓ రైతు ఆవేదన……
చిత్తూరు రూరల్ మండలం మాపాక్షి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు రామచంద్రయ్య తనకున్న రెండెకరాల పొలంలో చిక్కుడు అంతర పంటలను సాగు చేశాడు .పంట సాగుకు 50 వేల వరకు ఖర్చు అయినది. అందులో 16,000 వరకు ఎరువులకు సరిపోయింది. త్వరలో ఎరువుల ధరలు పెరుగుతున్నాయని తెలిసి ఆయన ఆందోళన చెందుతున్నారు. చిక్కుడు పంటకు గ్రోమోర్ ఐదు బస్తాలు, 28- 28 -0 నెంబర్ బస్తాలు 10, డీఏపీ 5 బస్తాలను వాడానని ఎరువుల ధరలు పెరిగితే మరో 3 వేల దాకా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నాడు. పెట్టుబడి ఖర్చులు రవాణా ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వ్యాపారుల ప్రభుత్వాల నుంచి గిట్టుబాటు ధరలు అందడం లేదని చిక్కుడు బస్తా ధర 400 పలికితే కొంత లాభం ఉంటుందని కానీ మార్కెట్లో 150 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నాడు.

ఎరువుల ధరలు పెరుగుతున్నాయి
అంతర్జాతీయ మార్కెట్లో డిఎపి కాంప్లెక్స్ ఎరువుల తో పాటు ముడిసరుకుల ధరలు పెరగడంతో మన దేశంలో కూడా ధరలు పెంచాల్సి వస్తుంది .డి ఏ పి పై బస్తా కు 200 నుంచి 250 రూపాయలు, వరకు కాంప్లెక్స్ ఎరువుల పైన కూడా దాదాపు ఇదే మోతాదులో ధరలు పెరిగే అవకాశం ఉంది .ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముడిసరుకు సహా నేరుగా దిగుమతి చేసుకున్న ఎరువులపై అంతర్జాతీయ కంపెనీలు తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. ఆ మేరకు పెరిగిన ధరల ప్రకారం ఎరువులను కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఆ దిశగా రైతులకు విక్రయిస్తున్నారు.ని నిలిపి వేసింది. – వ్యవసాయ శాఖ ఏడి

Advertisement

తాజా వార్తలు

Advertisement