Monday, April 29, 2024

కార్డాన్ సెర్చ్.. బీటీఆర్ కాలనీలో పోలీసుల త‌నిఖీలు

తిరుపతి సిటీ : తిరుపతి నగరంలోని బీటీఆర్ కాలనీ, మంగళం ప్రాంతాల్లో తిరుపతి జిల్లా లా అండ్ ఆర్డర్ అదరపు ఎస్పీ కులశేఖర్, అదనపు ఎస్పీ అడ్మిన్ సుప్రజ, ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ సంయుక్తంగా కలిసి ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అలాగే వాహనాలు తనిఖీ చేస్తూ రికార్డు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటింటికి వెళ్లి వారి ఆధార్ కార్డులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. అదే విధంగా రికార్డు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతున్నది. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తిష్ట వేసి దొంగతనాలు, ఇతర కార్యక్రమాలు చేపడతారని అనుమానంతో అప్పుడప్పుడు కార్డాన్.. సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నదని వివరించారు. ఆ ప్రాంతంలో విస్తృతంగా పోలీస్ సిబ్బందితే ముమ్మరు తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అలిపిరి సీఐ అబ్బన్న, ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, అలిపిరి ఎస్సైలు జయ చంద్ర, ఇమ్రాన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement