Tuesday, April 13, 2021

శ్రీకాళహస్తిలో విస్తృత తనిఖీలు నిర్వహించిన కమిషనర్

శ్రీకాళహస్తి – పట్టణము నందు, లాడ్జిలు, హోటళ్లు , మెడికల్ షాపు యజమానులతో మరియు ఆర్.ఎం.పి డాక్టర్ల తో శనివారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసన్ సమావేశమునిర్వహించారు.ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, లాడ్జిలకు వచ్చే యాత్రికుల వివరములు సేకరించావలసినదిగా, మరియు హోటల్ కు వచ్చేవాళ్ళు విధిగా మాస్కులు ధరించావలసినదిగా సూచించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలోని కైలాసగిరి కాలనీ నందు వున్న బాల సదన్ లో తనిఖీ చేశారు. బాల సదన్ వున్న విద్యార్ధులకు ఇచ్చే మెను (ఆహారం వాడ్డించు పట్టిక) పరిశిలించారు. బాత్ రూమ్స్ లను పరిశుభ్రత ను మరియు కరోనా జాగ్రత్త లను తెలియజేశారు. సినిమా వీదిమరియు కొండమిట్ట , తెలుగు గంగ కాలనీ నందు ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను కమిషనర్ స్వయం గా వెళ్లి పరిశిలించారు. వార్డులలోకి వెళ్లి ప్రజలను వ్యాక్సిన్ వేసుకోనుటకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించావలసినదిగా సచివాలయ ఉద్యోగులను కోరారు.. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News