Monday, April 12, 2021

వైభవంగా వల్లభాపురం పాల‌క‌వ‌ర్గ‌ ప్రమాణ స్వీకార మహోత్సవం

కొల్లిపర, మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యదర్శి అలకనంద ఆధ్వర్యంలో సర్పంచి వల్లభాపురం నిర్మల, ఉప సర్పంచ్ అవుతూ పోతిరెడ్డి వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ పోతి రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహకారంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్న దే తమ ఉద్దేశమని తెలియజేశారు. గ్రామస్తులకు ఏ సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులు కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం లో వార్డు సభ్యులు చదలవాడ సుజాత, బొట్ట సరస్వతి, అవుతూ శ్రీనివాసరెడ్డి, పోకూరి అంజలి, అవుతు వెంకట్రెడ్డి, లంకి రెడ్డి సుష్మా, విప్పల రాధిక, దేశ బోయిన శ్రీనివాసరావు, తాడి బోయిన లక్ష్మీతిరుపతమ్మ, తమ్మ బాలకృష్ణ, పరిమి బాబురావు, మంచికలపూడి నాగమణి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News