Tuesday, April 13, 2021

ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్.. డేట్స్ ఇవే!

తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఐసెట్ ఫలితాలు విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్రంలో 14 రీజినల్ సెంటర్లలో ఐసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఐసెట్ నిర్వహణ కోసం 60 కేంద్రాలను గుర్తించారు.

ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీక‌రిస్తారు. 250రూపాయ‌ల ఫైన్ తో జూన్ 30 వరకు, 500రూపాయ‌ల ఫైన్ తో జులై 15 వరకు ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంది. క‌రోనా జాగ్ర‌త్త‌ల‌తోనే ఐసెట్ ప‌రీక్ష‌కు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్​ను‌ కంట్రోలర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News