Sunday, April 28, 2024

కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు .. గిడుగు రుద్రరాజు

తిరుపతి సిటీ : కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. సోమవారం బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవనం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 100 సీట్లు గెలవడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్, ఎర్ర చందనం, ఇసుక, భూ మాఫియాలతో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని సమస్తాగతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాల‌ నుంచి వచ్చిన పార్టీ అని ఈ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని వివరించారు. కర్తవ్యం ఒక్క‌టే అందరం కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద విప్లవమ‌ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్టరీ యూనిట్ లాంటిదని, కాంగ్రెస్ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పోవడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులు కూడా భద్రత కావాలని గవర్నమెంట్ ను కూడా కలవడం జరిగిందని తెలియజేశారు.

అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ నిర్వహించినప్పుడు ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభించిందన్నారు. 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్రను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 14వ సంవత్సరం వరకు ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని విస్తృతంగా గ్రామీణ స్థాయి నుంచి ప్రచారం చేయడం.. ఇటీవల కూడా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖ‌ర్గే సారథ్యంలో వివిధ ప్రాంతాల్లో కూడా సభలు, సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి రాజకీయ నాయకులకు విలువలు లేకుండా చేయడం జరిగిందన్నారు. తమకు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నియంత్రణ పాలనకు ప్రజలు దొంగలే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని విభజించి ఆదాని అనే వ్యక్తికి, కార్పొరేట్ మాఫియా తయారు చేశారన్నారు. ఆదాని మీద‌ పార్లమెంట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి మేయప్ప, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పోచం రెడ్డి రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్, మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి గోపి, ప్రమీలమ్మ, రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ సుబ్బరామయ్య , శ్రీనివాసరెడ్డి, పూల చంద్రశేఖర్, శాంతి యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement