Thursday, April 25, 2024

బ్రెజిల్‌లో వరదల బీభత్సం.. విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. 24 మంది మృతి..

బ్రెజిల్ లోని ఉత్తర సావో పాలో రాష్ట్రంలోని పలు నగరాల్లో వరదలు భిభ‌త్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో 24 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బ్రెజిల్ అధికారులు ఆదివారం తెలిపారు. దీంతో ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారు, గాయపడిన వారు, తప్పిపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్‌లు గాలిస్తున్నాయి. బ్రెజిల్ ను వాన‌లు ముంచెత్తాయి. గత ఒక్కరోజే ఈ ప్రాంతంలో 600 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బ్రెజిల్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షపాతం ఇదేనని ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో, బెర్టియోగా నగరంలో 687 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు జలమయమై పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. నివాసితులు చిన్న పడవల్లో సరుకులను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement