Monday, April 29, 2024

ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు..

తిరుమల : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 62వ జన్మదినం సందర్భంగా శుక్రవారం తిరుమలలో అఖిలాండం వద్ద బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో 1001 కొబ్బరికాయలు కొట్టి ఆరు కేజీల కర్పూరంతో హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.. ఈ సందర్భంగా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ… నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం తిరుమలలో అఖిలాండం వద్ద మొక్కులు తీర్చుకోవడంతోపాటు వివిధ కార్యక్రమాలు చేయడం జరిగిందని వివరించారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరవర్మ, హరి, రూపేష్, బొంగు బాలాజీ, మహేష్, సుబ్బు, పార్ధు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement