Thursday, May 2, 2024

Chitoor – రూ 2 కోట్ల విలువైన వెయ్యి ఫోన్ల రికవరీ…

చిత్తూరు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) :చోరీలకు గురైన రూ 2.05 కోట్ల విలువైన 1000 సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసు శాఖ చాట్ బాట్(9440900004), సి ఈ ఐ ఆర్ (సెంట్రల్ ఏక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ) పోర్టల్ ద్వారా మూడు విడతలలో రికవరీ చేసారు. తొలివిడతలో రూ ఒక కోటి 45 లక్షల విలువైన 500 ఫోన్లను, రెండవ విడత లో రూ 60 లక్షల విలువైన 200 ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు ఈరోజు రూ 60 లక్షల విలువైన 300 ఫోన్లను రికవరీ చేసారు

. ఈ సందర్బంగా చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్ పి ( అడ్మిన్ ) ఎల్.సుధాకర్ వివరించారు. రికవరీ చేసిన వాటిలో జమ్మూ & కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి కూడా రికవరీ చేసిన మొబైల్ ఫోన్లున్నాయని తెలిపారు. బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం తో ఆనందం వ్యక్తం చేస్తున్నారని,ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరుకు రాని వారికి ప్రత్యేకంగా కొరియర్ ద్వారా బాదితుల ఫోన్ లను నేరుగా వారి ఇంటికి చేర్చుతున్నామని తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వారు ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి “చాట్ బాట్/ సి ఈ ఐ ఆర్ ” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను మరల పొందవచ్చునని తెలిపారు.

చాట్ బాట్ కు పంపవలసిన విధానాన్ని వివరిస్తూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు హాయ్ , లేదా హెల్ప్ అని పంపాలి. తర్వాత వెనువెంటనే వెల్కమ్ టు చిత్తూరు పోలీస్ పేరున ఒక లింకు మొబైల్ కు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుందని వివరించారు.

.ఫోన్లు పోగొట్టుకున్న వారి మొబైల్స్ ను రికవరీ చేయడంలో విశేష కృషి చేసిన చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ భాస్కర్, క్రైమ్ ఎస్.ఐ. ఉమా మహేశ్వర రావు, చాట్ బాట్ సిబ్బంది బాపూజీ, శ్రీనివాసన్, రఘురామన్, వారి టెక్నికల్ అనాలసిస్ వింగ్ ఇంచార్జ్ దేవరాజులు తదితర సిబ్బంది ని అభినందిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement