Monday, May 6, 2024

ప్రకాశం జిల్లాలో 19 నుంచి చంద్రబాబు పర్యటన..

అమరావతి, ఆంధ్రప్రభ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మెత్తం మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు మార్కాపురంలోనే ఉండనున్నారు. ఇక 20వ తేదీన మార్కాపురంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు పార్టీ నేతలు భారీ ఎత్తున నిర్వహించనున్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, టీడీపీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ఏర్పాట్లు పరిశీలించారు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. రోడ్‌షోలు, రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ఆపార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement