Sunday, May 19, 2024

సూర్య42 అధిరిపోయే పోస్టర్ తో టైటిల్ ఎనౌన్స్ చేసిన మేకర్స్..

దర్శకుడు సిరుత్తై శివతో దర్శకత్వంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా సూర్య42. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇదివరకే ఈ సినిమా నుంచి చూర్య ప్రీ-లుక్స్, గ్లింప్‌లతో మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ బిగ్గీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది, కాగా, ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకు ‘కంగువ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో, అదే విషయాన్ని తెలియజేసేందుకు డేగతో కూడిన క్రియేటివ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అంతేకాకుండా, 1 నిమిషం కంటే ఎక్కువ ప్రత్యేక యానిమేషన్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ వచ్చే ఏడాది (2024) ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించారు. ఇక ఈ సిినిమా 10 భాషల్లో రిలీజ్ కానుంది. కె.ఇ.యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లతో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ చిత్రం 3డి ఫార్మాట్‌లో ఉండనుంది.

YouTube video

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement