Wednesday, May 1, 2024

AP | 25 నుంచి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, షెడ్యూలు ఇదే..

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 25, 26, 27వ తేదీల్లో బాబు పర్యటన ఉంటుందని పార్టీ యంత్రాంగం స్పష్టం చేసింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజక వర్గాలతో పాటు గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజక వర్గంలో చంద్రబాబు పర్యటించ‌నున్నారు. ఒక్కోరోజు ఒక్క నియోజక వర్గంలో చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొంటారు. అదే విధంగా ఆయా నియోజక వర్గాలలో ఏర్పాటు చేసే సభల్లో కూడా ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో రాత్రి బస కూడా చేయనున్నారు. నియోజక వర్గాల వారీగా సమీక్ష కూడా ఉండ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement