Friday, December 6, 2024

AP: చంద్ర‌బాబుకు హాని… జైలులోనే కుట్ర‌… నారా లోకేశ్ ఆరోప‌ణ‌లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యంతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆయ‌న‌ ఆరోపించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. అందుకే చంద్రబాబుకు జైలులో వసతులు కల్పించడం లేదన్నారు.

హెల్త్ బులెటిన్ పై పెట్టిన శ్రద్ధ చంద్రబాబు ఆరోగ్యంపై పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జైలు అధికారుల తీరు అనుమానంగా ఉందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష అని లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు హాని జరిగితే ప్రభుత్వం, జైలు అధికారులదే బాధ్యతని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజమండ్రికి వస్తున్న లోకేశ్ సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన 5కిలోల బరువు తగ్గారని ఆయన భార్య నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement