Wednesday, May 1, 2024

నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని… పేర్ని నాని

నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని అని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ… అశ్లీలాన్ని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. తనకు అనుకూలమైన వారితో కలిసి చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. అమెరికా సంస్థల్ని కూడా దిగజారుడు రాజకీయాల్లోకి లాగుతున్నారన్నారు. చంద్రబాబు రాజకీయంగా ఎంతకైనా దిగజారుతారన్నారు. వ్యవస్థలను తన అవసరాలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు తాను దిగజారుతూ.. పక్కవాళ్లను కూడా లాగుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement