Friday, April 19, 2024

ఆక‌ట్టుకుంటోన్న ఘోస్ట్ మూవీ ప్రోమో- యుద్దానికి క‌త్తిని సిద్ధం చేసిన నాగార్జున‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీ తెరకెక్కుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి స్పెషల్ ప్రోమో విడుదల చేశారు. అలాగే ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జునకు ఓ సందేశం అందుతుంది. తనపై అటాక్ జరగనుందని ఆ సందేశం సారాంశం. ఇక శత్రువులను అంతమొందించడానికి నాగార్జున స్వయంగా కత్తి సిద్ధం చేసుకోవడం ప్రోమో చూడవచ్చు. రెండు నిమిషాల ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా నాగార్జున మాజీ ఏజెంట్ విక్రమ్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఘోస్ట్ మూవీ ట్రైలర్ ఆగస్టు 25న విడుదల కానుంది. నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. బడ్జెట్ కి వెనుకాడకుండా చాలా భాగం విదేశాల్లో చిత్రీకరించారు. దుబాయ్ తో పాటు దేశాల్లో ఘోస్ట్ చిత్రీకరణ జరిగింది. ప్రతికూల పరిస్థితుల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement