Sunday, May 19, 2024

చంద్ర‌బాబు బ‌ర్త్ డే.. ఊహించ‌ని విధంగా విషెష్ చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి

నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూ టిడిపి అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుపై ధ్వ‌జ‌మెత్తుతుంటారు వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి.అయితే అనూహ్యంగా ఆయ‌న . చంద్ర‌బాబుకి శుభాకాంక్షలు తెల‌ప‌డం స‌ర్వ‌తా ఆస‌క్తినెల‌కొంది. టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని విజయసాయి ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు విజయసాయి దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని దాదాపుగా ఆపేశారు. ఈ తరుణంలో చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement