ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం కొవ్వూరు చేరుకోనున్నారు చంద్రబాబు. చాగల్లు రోడ్డు నుండి విజయ విహార్ సెంటర్ వరకు రోడ్ షోలో పాల్గొననున్న టీడీపీ అధినేత.. అనంతరం ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇక, సభ అనంతరం గోపాలపురం పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు కొవ్వూరు పర్యటన, ప్రజాగళం సభ విజయవంతంపై బుధవారం టీడీపీ నేతలు సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో సంయుక్తంగా, వేర్వేరుగా సమావేశమై సభ జయప్రదానికి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ రోజు మధ్యాహ్నం లక్ష్మీవెంకటేశ్వర రైస్‌మిల్లు ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు చంద్రబాబు.. అక్కడి నుంచి కార్లు, బైక్ ర్యాలీ మధ్య ప్రదర్శనగా విజయవిహార్ సెంటర్‌కు వరకు చేరుకోనున్నారు చంద్రబాబు..