Wednesday, December 11, 2024

Breaking: ఈనెల 24వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. అయితే 14రోజుల రిమాండ్ గడువు ముగియడంతో… ఆ రిమాండ్ ను ఏసీబీ కోర్టు ఈనెల 24వ తేదీ వరకు పొడిగించింది.

దీంతో చంద్రబాబు మరో రెండు రోజుల పాటు రిమాండ్ లో కొనసాగనున్నారు. సీఐడీ చంద్రబాబును వర్చువల్ గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా చంద్రబాబు తనను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని చంద్రబాబు తెలిపారు. చేయని తప్పు చేశానని చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. తనను అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగా లేదన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇదిలా ఉండగా కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు రానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement