Tuesday, October 1, 2024

Breaking: ట్రావెల్ బస్సు, లారీ ఢీ.. ఇద్దరు మృతి, 40మందికి తీవ్రగాయాలు

ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 40మందికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి క్రాస్ వద్ద ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రొద్దుటూరు నుంచి రామేశ్వరం బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సంబేపల్లి మండలం శెట్టిపల్లి క్రాస్ వద్ద ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. గాయపడిన క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. గాయపడిన క్షతగాత్రులు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement