Wednesday, May 1, 2024

చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌లో భారీ మార్పులు … ఆ దిశ‌గా ఎస్సీజి అడుగులు

అమరావతి, ఆంధ్రప్రభ: టీ-డీపీ అధినేత చంద్రబాబునాయుడు భద్రతను మరింత కట్టు-దిట్టం చేసే పనిలో ఎన్‌ఎస్‌జీ వున్నట్లు- తెలుస్తోంది. యర్రగొండపాలెం ఘటనతో అప్రమత్తమైన ఎన్‌ఎస్‌ జీ అధికారులు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు- స్పష్టమవుతోంది. చంద్రబాబు భద్రతకు సంబంధించి పలు కీలమైన అంశాలను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్ళింది. దేశవ్యాప్తంగా నేతల భద్రత, స్థానిక రాజకీయ పరిస్థి తుల గురించి కేంద్రానికి ఎప్పటికప్పు డు సమాచారం వెళ్తూనే ఉంటు-ంది. దీనిలో భాగంగానే ఉగ్రముప్పు ఉన్న చంద్రబాబుకు కేంద్రం ఎన్‌ఎస్‌జి భద్రత కల్పించింది.అత్యంత సుశిక్షుతులైన ఎన్‌ఎస్‌జీ కమెండోలు రక్షణగా ఉంటు-న్నారు. ఇటీ-వల పరిణామాల్లో చంద్రబాబు కు గతం లో కన్నా భారీగా భద్రత పెంచారు. ఒకవైపు ఉగ్రముప్పు, మరోవైపు రాజకీయ ముప్పు వుండటం తో పాటు- చంద్రబాబు ఏపీ లో విస్తృత స్థాయిలో పర్యటనలు చేస్తూ వుండటం తో ఇప్పుడు భద్రత ను మరింత కట్టు-దిట్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో..ఆయనకు మరింత భద్రత పెంచారు.

ఇప్పుడు 12 మంది సుశిక్షితులైన కమెండోలు జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత ఇస్తున్నారు. జెడ్‌ ప్లస్‌ అంటే.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే ప్రోటోకాల్‌ కూడా ఉంటు-ంది. కానీ అవేమీ స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇదేసమయం లో ఏపీ పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, వారు కూడా రాజకీయ కుట్రల్లో భాగం అవుతున్నారని తరచూ టీ-డీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటనలో పోలీసుల తీరు దేశవ్యాప్త చర్చనీయాంశమయింది. టీ-డీపి అధినేత చంద్రబాబు పై తరచూ రాళ్ల దాడి ఘటనలు జరగడాన్ని ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు-గా తెలుస్తోంది. రాళ్ల దాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్‌ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్‌ క్వార్టర్స్‌ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనకారుల‌ను రానివ్వడంపై ఎన్‌ఎస్‌జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖకు కూడా ఎన్‌ఎస్జీ నివేదిక పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎన్‌ఎస్‌జీ రక్షణ లో ఉన్న చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన విధానంలో మార్పుల గురించి కేంద్ర హోంశాఖలో చర్చలు జరుగుతున్నట్లు-గా విశ్వసనీయ సమాచారం. ఏపీ డీజీపీకి స్పష్టమైన మార్గదర్శకాలు కేంద్ర హోంశాఖ నుంచి వస్తాయని చెబుతున్నారు. చంద్రబాబుకు రాష్ట్ర పోలీసులు కల్పించాల్సిన భద్రత కు సంబంధించి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పర్యటనల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లు-, ఇతర అంశాల పై కేంద్ర హోంశాఖ అధికారులు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటు-న్నాయి. త్వరలోనే కేంద్ర హోం శాఖ ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటు-ందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement