Thursday, April 25, 2024

రుయా ఆస్పత్రి ఘటన: హృదయం క్షోభిస్తోందన్న చంద్రబాబు

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో బాలుడి మృతి పట్ల తన హృదయం క్షోభిస్తోందని అన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆ బాలుడి తండ్రి అధికార వర్గాలను వేడుకున్నా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఆసుపత్రి అంబులెన్స్ లు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ముందుకొచ్చినా.. ఆ పేద తండ్రి అంత ఖర్చు భరించలేకపోయాడని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నబిడ్డ శవాన్ని బైక్ పై వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హృదయాలను మెలితిప్పే ఈ విషాదం రాష్ట్ర ఆరోగ్య రంగ దుస్థితికి నిదర్శనం అని తెలిపారు. జగన్ పాలనలో ప్రతిదీ లోపభూయిష్టమేనని చంద్రబాబు విమర్శించారు.

కాగా, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రైవేట్ అంబులెన్స్ ను రుయా లోపలికి రానివ్వకపోడంతో బైక్ పై బిడ్డ మృతదేహాన్ని 90 కి.మీ తీసుకెళ్లాడు తండ్రి. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో జెసవ మృతదేహాన్ని తలించెందుకు రాజంపేట నుంచి ఉచిత అంబులెన్స్ పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై జెసవ మృతదేహాన్ని తరలించారు. సిండికేట్‌గా మారిన అంబులెన్స్‌ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement