Saturday, December 7, 2024

AP: ఛ‌లో విజ‌య‌వాడ ..వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ఉపాధ్యాయులు … ఎక్క‌డిక‌క్క‌డ అరెస్ట్‌లు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన ‘ఛ‌లో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు. దీంతో విజయవాడ లెనిన్‌ సెంటర్‌కు యూటీఎఫ్‌ నాయకులు, వేలాదిగా ఉపాధ్యాయులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి అధ్యక్ష, కార్యదర్శులను నిర్బంధించారు.
విజయవాడ లో 144 సెక్షన్…
విజయవాడలో టీచర్స్ ఫెడరేషన్ యుటిఎఫ్ తలపెట్టిన ధర్నాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యుటిఎఫ్ ధర్నాకు అనుమతులు లేదన్నారు. విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీసులు ధర్నాకు వెళ్లకుండా టీచర్లు ను ముందస్తు అరెస్టులు చేశారు.. న‌గ‌రంలోకి ప్ర‌వేశించ‌కుండా న‌లుమూల చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఆందోళ‌న‌కు త‌ర‌లివస్తున్న వంద‌లాది మంది టీచ‌ర్ల‌ను అక్క‌డే నిలువ రించారు. మరో వైపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ కార్మికులు, అంగన్వాడిల ధర్నాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement