Monday, April 29, 2024

AP: సర్పంచుల ఛలో అసెంబ్లీ…ముంద‌స్తుగా హౌస్ అరెస్టులు

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి సర్పంచ్‌ల‌ 16డిమాండ్ల పరిష్కారం కొరకు 6న “చలో అసెంబ్లీ” కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీని ముట్టడించి తమ హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు పోలీసులు నోటిసులు అందజేశారు. మరి కొందరిని అదుపులో తీసుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్‌ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంపిన 8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను గ్రామ పంచాయతీల, సర్పంచుల ఆధీనంలోనే పని చేయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి సర్పంచ్ల చేతే ఖర్చు చేయించాలని కోరారు. గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement