Monday, April 29, 2024

Ap: జ‌గ‌న్ పై చంద్ర‌బాబు గ‌రం గ‌రం…

ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ, , తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు తప్పుడు వార్తలు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాయగాళ్లు వచ్చారని అన్నారు.

- Advertisement -

వెధ‌వ‌ల్లారా మీకు సిగ్గులేదు ..

వెధవల్లారా… మీకు సిగ్గులేదు… ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పానని, కానీ ఫేక్ వార్తలతో అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్ర‌బాబు . ”నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌. తెదేపా డీఎన్ఏలోనే బీసీ ఉంది. మాది పేదల పక్షం.. మీతోనే ఉంటాం. వైకాపాలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. అది భూస్వాములు, పెత్తందారుల పార్టీ.

వైకాపా హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం. రాయలసీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దు. ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్‌. అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెదేపా. వెనుకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తాం. కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం. ఎమ్మిగనూరుకు టెక్స్‌టైల్‌ పార్కు తీసుకువస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement