Friday, April 26, 2024

వివేకా హత్య కేసు.. విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్టి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. నేటి నుంచి విచారణ మళ్లీ ప్రారంభంకానుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి ఆదివారం సాయంత్రం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. ఇప్పటికే పలు దపలుగా వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ మరోసారి పలువురు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.

2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. ఆ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ ఆ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయింది. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా సిట్ వేయగా.. అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఈ కేసు ఎంతకీ తేల్చకపోవడంతో వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement