Tuesday, April 23, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాస వైభవం-26 (ఆడియోతో)…

స్నానార్థం మాసి వైశాఖే పాదమేకం చరేద్యది |
సో2శ్వమేధాయుతానాంచ ఫలమాప్నోత్య సంశయమ్‌ |
అధవా కూటచిత్తస్తు కుర్యాత్సంకల్ప మాత్రకమ్‌ ||

సోపిక్రతు శతం పుణ్యం లభే దేవ నసంశయ: |
యోగచ్ఛేదనుయామంతు స్నాతుం మేష గతేరవౌ ||

సర్వబంధ వినిర్ముక్త: విష్ణోస్సాయుజ్య మాప్నుయాత్‌ |
త్రైలోక్యేయాని తీర్థాని బ్రహ్మాండాతర్గతానిచ ||

తాని సర్వాణి రాజంతి సబాహ్యేల్పకే జలే
తావల్లిఖిత పాపాని గర్జన్తి యమశాసనే ||

యావన్న కురుతే జంతుర్వైశాఖే స్నానమంభసి |
తీ ర్థాది దేవతా స్సర్వా: వైశాఖే మాసి భూమిప||

- Advertisement -

బహిర్జలం సమాశ్రిత్య సదా సన్నిహితా నృప|
సూర్యోదయం సమారభ్య యావత్‌ షట్‌ ఘటికావధి ||

తిష్ఠంతిచాజ్ఞయా విష్ణో: నరాణాం హితకామ్యయా |
తావన్నగచ్ఛతాం పుంసాం శాపం దద్యాం సుదారుణమ్‌ ||

వైశాఖ మాసమున బాహ్యజలమున స్నానము కొరకు ఒక్క అడుగు నడిచిన వారు పదిలక్షల అశ్వమేధ యాగముల ఫలమును పొందెదరు. కపట చిత్తుడైననూ వైశాఖమాసమున స్నానము చేసెదనని సంకల్పించి నచో అతనూ నూరు యాగముల పుణ్యమును తప్పక పొందును. సూర్యుడు మేషమున ఉండగా ప్రతిఝామున స్నానమునకు వెళ్ళినచో వారు సర్వబంధ వినిర్ముక్తుడై విష్ణ ు సాయుజ్యము పొందెదరు. త్రైలోక్యమున నున్న తీర్థములన్నీ బ్రహ్మాండమున నున్న తీర్థములన్నీ వైశాఖ మాసమున బాహ్యజ లములలో అనగా నదీనద సరస్సులలోని తీర్థములలో నుండును. వైశాఖ మాసమున బాహ్య జలమున స్నానము చేయనంతవరకే యముడి శాసనమున వ్రాయబడిన పాపములు గర్జించును. తీర్థాది దేవతలందరూ వైశాఖ మాసము బాహ్యజలమున ఆశ్రయించియుండును. సూర్యోదయము నుండి ఆరు ఘడియల వ రకు శ్రీమహావిష్ణువు ఆజ్ఞ తో సకలజనుల
హితముకొరకు బాహ్యజలములలో నుండును. అంతలో రానివారికి భయంకరమైన శాపమును ఇచ్చి వెళ్ళును. కావున సూర్యోదయము నుండి ఆరు ఘడియలలోపు బాహ్యజలమున స్నానము చేయవలయును.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement