Tuesday, May 7, 2024

శ్రీశైలంకు జలకళ – 816.20 అడుగులకు చేరిన నీటి మట్టం

కర్నూలు బ్యూరో – కృష్ణ క్యాచ్‌మెంట్‌లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా 52973 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. ఇందులో జూరాల నుంచి 52856 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి వినియోగం ద్వారా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు హంద్రీ నది నుంచి 117 క్యూసెక్కుల నీరు జలాశయం కు చేరుకుంటుంది. దీంతో శ్రీశైల జలాశయం 885 అడుగుల గాను ,ప్రస్తుతం 816.20 అడుగులకు చేరుకుంది. ఇక జలాశయంలో 38 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి.


వాస్తవంగా వరదలకు ముందు శ్రీశైల జలాశయం లో నీటి నిల్వలు 805 అడుగులుగా ఉంది. ప్రస్తుతం వస్తున్న వరదలతో రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలకు ముందు కృష్ణా బేసిన్‌లోనీ ఏ ప్రాజెక్టులోనూ ఆశించిన స్థాయిలో నీళ్లు లేవు. తాగడానికి కటకటగా ఉన్న సమయంలో అటు కర్ణాటక, ఇటు తుంగభద్ర నది పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసి ఇబ్బంది లేకుండా చేశాయి. ఇక ప్రాజెక్టులలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆయా ప్రాజెక్టులు నిండడానికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశముందని ఇంజనీర్లు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement