Wednesday, May 15, 2024

Cash Seize – వాషింగ్ మిష‌న్ ల‌లో నోట్ల క‌ట్ట‌లు ….విశాఖ‌లో రూ. 1.3 కోట్లు ప‌ట్టివేత

విశాఖపట్టణం: నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద రూ. 1.3 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును హవాలా నగదుగా పోలీసులు భావిస్తున్నారు. వాషింగ్ మెషీన్లలో నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం నుండి విజయవాడకు వాషింగ్ మెషీన్లను ఆటోలో తరలిస్తున్నారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా వాషింగ్ మెషిన్లలో నగదును తరలిస్తున్నారు.

అయితే వాషింగ్ మెషీన్లలోని తరలిస్తున్న నగదుకు ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ఈ నగదును హవాలా నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ నగదును ఎవరు తరలిస్తున్నారనే విషయమై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement