Saturday, October 12, 2024

Road Accident : విజయవాడలో కార్‌ రేసింగ్‌ కలకలం..

విజయవాడలో కార్‌ రేసింగ్ కలకలం సృష్టించింది. రెండు స్కూటీలను ఫార్చునర్‌ కారు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై రమేష్ ఆసుపత్రికి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కారుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు రేసింగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఫార్చునర్ కారు ఢీ కొట్టింది. దీంతో స్కూటీలపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. రెండు స్కూటీలు రెండు ముక్కలుగా విరిగిపోయయాయి. కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement