Thursday, May 2, 2024

Priayanka : ఇవాళ తెలంగాణ‌లో ప్రియాంక ప్రచారం..

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అనంతరం గిరిజనులకు ఆరాధ్య దైవమైన నాగోబా ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆ తర్వాత సమీపంలోని ఓ లంబాడ తండాకు వెళ్లి గిరిజన మహిళలతో సమావేశం అవుతారు. వాళ్లతో కలిసి భోజనం చేసి, ఆరు గ్యారెంటీలను వివరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement